Date : Jun 12 2016             Views :
We all know from the mega compound who became popular as an Anchor and as an web series actor. She is non other than Neeharika konidela who is acting in a movie under the direction of Rama Raju in the production of Madura sreedhar named 'Oka Manasu'.

Now for the first time a heroine is coming from mega family so she met 200 lady fans at Chiranjeevi blood bank who came from different districts and answered their questions.

She spoke
"I'll take care that every movie which come form me will not hurt fans or my family. I'm hoping that you'll bless me as  you encouraged all mega hero's. Coming to Oka manasu every one will see themselves on screen. I am feeling proud that for the first film I got this subject. With this film there will be change in every girl for sure. Total family can go to this movie and enjoy. Vennela kishore comedy is going to be one of highlights for this movie. Working with Naga Shaurya is very happy. Audio is listened by some lakhs of people already. Really superb music is given by Suneel Kyashap. Thankyou for all of you  who came to meet me. We will meet on 24th of this month with Oka Manasu.


మెగా కాంపౌండ్ నుంచి యాంక‌ర్ గా, వెబ్ సిరీస్  న‌టిగా మ‌న‌కు సుప‌రిచితురాలు అయిన నిహారిక ఇప్పుడు రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న ఒక మ‌న‌సు చిత్రంతో మెగా వార‌సురాలిగా మ‌న‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే మొద‌టిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న న‌టిగా ఫ్యాన్స్ కు ఉన్న అపోహ‌లు, అనుమానాలు తొలగించ‌డానికి ఈరోజు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో వివిధ జిల్లాల నుంచి 200 కు పైగా వ‌చ్చిన మ‌హిళా అభిమానుల‌తో నిహారిక  ముచ్చ‌టించి, వాళ్ల ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులిచ్చింది.

ఆ ముచ్చ‌ట్లు ఆమె మాటల్లో..

నా నుంచి వ‌చ్చే ఏ సినిమా వ‌ల్ల అయినా అభిమానుల‌కు గానీ, మా ఫ్యామిలీ కి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మెగా వార‌సుల‌ను ఆశీర్వదించిన‌ట్టుగా నన్ను కూడా ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో ఉన్నాను. ఒక మ‌న‌సు గురించి చెప్పాలంటే, ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ను తాము చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది. నా మొద‌టి చిత్రంకు ఇలాంటి సబ్జెక్ట్ దొర‌క‌డం నిజంగా నా అదృష్టం. ఈ చిత్రం త‌ర్వాత ఖ‌చ్చితంగా ఆడ‌పిల్ల‌ల్లో ప్రేమ విష‌యంలో మార్పు వ‌స్తుంది. ఫ్యామిలీ అంతా వెళ్లి చూసేలా ఒక మ‌న‌సు ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. నాగ‌శౌర్య‌తో చేయ‌డం చాలా హ్యాపీ.ఇప్ప‌టికే పాట‌ల‌ను కొన్ని ల‌క్ష‌ల మంది విన్నారు. నిజంగా అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు సునీల్ క‌శ్య‌ప్. నాకోసం ఇంత దూరం వ‌చ్చిన మా మెగా అభిమానులంద‌రికీ చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈనెల 24న ఒక మ‌న‌సుతో థియేట‌ర్ల‌లో క‌లుద్దాం.