Date : Mar 10 2015             Views : 20

The curious poster of jadoogadu released coupla days back by the production house satyaa entertainments has revealed today that jadoogadu is none other than "Naga shaurya".Here is the first look poster of jadoogadu along with a motion poster which has naga shaurya playing a very street smart guy in the film.unlike his earlier films this is an action entertainer directed by yogesh and produced by v.v.n prasad.The look and the feel of the film is as the poster proclaims an action entertainer !!!


సత్య ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం:1 'జాదూగాడు' గా నాగశౌర్య..!

'చింతకాయల రవి' ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ పతాకం ఫై ఓ చిత్రం రూపొందుతోంది . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య',లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’ ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ‘జాదూగాడు’ అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

'జాదూగాడు': మాస్ ఎంటర్ టైనర్, చిత్ర దర్శకుడు 'యోగేష్' మాట్లాడుతూ..' కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని తెలిపారు. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు.

ఏప్రిల్ లో 'జాదూగాడు' విడుదల: పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ నెలలోనే చిత్రం ఆడియో, ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

ప్రధాన తారాగణం : కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.


సాంకేతిక వర్గం :సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్.వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి
నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్