Date : Oct 30 2015             Views :
odiya singer rituraj mohanty telugu song

Director Raj Madiraju, who has made critically acclaimed films like Rushi and Andhra Pori, is directing a new movie titled Aithe 2.0. Produced jointly by Dr Hemanth Vallapu Reddy, Dr Ravi N Rathi and K Vijaya Rama Raju under Firm 9 Pictures umbrella, the film has a special song by renowned Bollywood singer Rituraj Mohanty. The singer who shot to fame with the chart-buster song Sahib from Bhootnath Returns has recorded the song Ee gayame mee gamyama…e vanchane mee seerama… for the film which is a bilingual in Telugu and Hindi.

Briefing about the song, Raj Madiraju says,” Rituraj has a beautiful voice and ample talent. We recorded the song Ee gayame mee gamyama…e vanchane mee seerama… last night and the recording session went on till wee hours. It’s a pathos song and comes at a crucial point in the second hour of the film. We may listen to many songs, but songs like these come very rarely. Kittu Vissapragada’s lyrics are refreshing.”

Rituraj Mohanty is one of the three contestants of the singing reality show India's Raw Star and won the competition.  He also recorded a song for Salman Khan starrer Prem Ratan Dhan Payo.

Raj Madiraju explains that Aithe 2.0 has no connection with Aithe and is not a sequel to Gunnam Ganga Raju’s production venture. “Aithe 2.0 revolves around six youth who are always hooked to social media which eventually determines their future. The film is a techno thriller and explores the ill effects of social media and technology on youth. It has a good message for the audience.”

Arun Chilveru is scoring the music for this film which has editing by Shashank Mali. Koushik Abhimanyu cranks the lens, while Rajeev Nair is the art director.

ఐతే 2.0 కి  బాలీవుడ్ పాపుల‌ర్ సింగ‌ర్ రితురాజ్ మొహ‌న్ టీ పాట‌

రుషి, ఆంధ్రా పోరి..ఇలా విభిన్న‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ..మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ రాజ్ మ‌ధిరాజు. వైవిధ్య‌మైన క‌ధాంశంతో రాజ్ మ‌ధిరాజు తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఐతే 2.0 ఈ చిత్రాన్ని ఫిర్మ్ 9 పిక్చ‌ర్స్ అమ్ బ్రిల్లా బ్యాన‌ర్ పై డా.హేమంత్ వ‌ల్ల‌పు రెడ్డి, డా. ర‌వి ఎన్ ర‌తి, కె.విజ‌యరామ‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం బాలీవుడ్ పాపుల‌ర్ సింగ‌ర్ రితురాజ్ మొహ‌న్ టీ పాట పాడ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా  డైరెక్ట‌ర్ రాజ్ మ‌ధిరాజ్ మాట్లాడుతూ... బాలీవుడ్ పాపుల‌ర్ సింగ‌ర్ రితురాజ్ మొహ‌న్ టీ మా ఐతే 2.0లో ఓ పాట పాడ‌డం విశేషం. రితు రాజ్ మొహ‌న్ టీ పాడిన..... ఈ గాయ‌మే మీ గ‌మ్యం..ఈ వాంఛ‌నే మీ సీరామ అనే ప‌ల్ల‌వితో సాగే పాట‌ను రికార్డ్ చేసాం.  సినిమా సెకండాఫ్ లో ఒక కీల‌క ఘ‌ట్టంలో ఈ పాట వ‌స్తుంది. రితురాజ్ మొహ‌న్ టీ  బ్యూటీఫుల్ వాయిస్ తో  ఈ పాట మ‌రింత అందంగా...అద్భుతంగా వ‌చ్చింది. కిట్టు విస్సాప్ర‌గ‌డ ఈ పాట‌కి మంచి సాహిత్యాన్ని అందించారు. మ‌నం చాలా పాట‌లు వింటాం కానీ...ఇలాంటి పాట‌లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఖ‌చ్చితంగా ఈ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. రితురాజ్ మొహ‌న్ టీ స‌ల్మాన్ ఖాన్ తాజా చిత్రం ప్రేమ్ ర‌త‌న్ ధ‌న ప‌యో కి కూడా పాట పాడ‌డం విశేషం. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే....ఇది ఐతేకి మాత్రం సీక్వెల్ కాదు..ఐతే సినిమాకి ఐతే 2.0కి ఎలాంటి సంబంధం లేదు.ఇది ఆరుగురు యువ‌కులు చుట్టు తిరిగే క‌థ‌తో రూపొందుతుంది. ప్ర‌జెంట్ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ ఎలా ఉంది..? యూత్ పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుంది అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.  థ్రిల్ల‌ర్  గా రూపొందుతున్న ఈ మూవీతో యూత్ కు మంచి సందేశం అందిస్తున్నాం  అన్నారు. ఈ చిత్రానికి సంగీతం అరుణ్ చిల్వేరు, ఎడిటింగ్ శ‌శాంక్ మ‌లి, కెమెరా కౌసిక్ అభిమ‌న్యు, ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ్ నాయిర్ .

RELATED POSTS

--- No Related Postst Found ---